టార్గెట్ ఏపీ అసెంబ్లీ.. గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వ్యూహాలు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్ పార్టీల రాజకీయాలు ఆసక్తి గా మారాయి

Update: 2024-02-10 09:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ-జనసేన కూటమి, కాంగ్రెస్ పార్టీల రాజకీయాలు ఆసక్తి గా మారాయి. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలపై ఈ పార్టీల ఫోకస్ మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా ఈ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే నాయకులు ప్రతి రోజు ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ పాలనను ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేయనున్నారో ప్రజలకు వివరిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం!

కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకరావాలని చూస్తుంది. తాను ఈ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతు రచ్చబండ, రోడ్ షో, సభలు నిర్వహిస్తున్నారు.

క్యాడర్‌తో జనసేన

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తన ప్రచారాలు వేగవంతం చేశారు. మరోవైపు క్యాడర్‌తో అసెంబ్లీలో గెలుపే లక్ష్యంగా సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర నేతలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏపీ బీజేపీ‌తో టీడీపీ పొత్తులపై చర్చలు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీ అయిన టీడీపీ పార్టీ గత అసెంబ్లీలో చేసిన తప్పిదాలను చేయవద్దని భావిస్తున్నది. ఈ క్రమంలోనే రేపటి నుంచి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం కానుంది. రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేష్ "శంఖారావం" యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేతలు పూర్తి చేశారు. 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో లోకేష్ పర్యటన చేస్తారు. కార్యకర్తలు, ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారు. కాగా, యువగళం పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ యాత్ర కొనసాగనుంది. కాగా, ఏపీ బీజేపీ పార్టీ టీడీపీ పొత్తులపై అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తొంది. 

Tags:    

Similar News