టీడీపీ రెండు మూడు ముక్కలవ్వొచ్చు : Vijaysai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం టీడీపీలో జరగబోయే పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-03 12:50 GMT
టీడీపీ రెండు మూడు ముక్కలవ్వొచ్చు : Vijaysai Reddy
  • whatsapp icon

దిశ , డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం టీడీపీలో జరగబోయే పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని... సాక్ష్యాధారాలు ఉండబట్టే చంద్రబాబు నాయుబు అరెస్ట్ అయ్యాడని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాం కేసులో విచారణకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని తెలిస్తే నిర్దోషిగా బయటపడతారని అన్నారు. ఒకవేళ ఈ కేసులో ఆయన దోషిగా తేలితే మాత్రం ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా మారుతారని అంతేకాదు వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిందేనంటూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేవారు. మరోవైపు అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు అని చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు అని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News