Mla Kotamreddy అంతు తేల్చే పనిలో సీఎం జగన్.. రంగంలోకి ఇంటెలిజెన్స్

ఫోన్ టాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది...

Update: 2023-02-02 10:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ టాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని. వాటిని నమ్ముకోలేదని వైసీపీ చెప్తోంది. తాము కేవలం ప్రజలను మాత్రమే నమ్ముకున్నామని, ఇలాంటి దుష్ప్రచారం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదని కౌంటర్ ఇస్తోంది. అయితే టీడీపీ మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని తాము మొదటి నుంచి చెప్తున్నామని ఆరోపిస్తోంది. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెలియడంతో అసలు గుట్టు రట్టైందని టీడీపీ విమర్శిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తమ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మరో 35 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయంటూ బాంబు పేల్చారు. ఈ అంశం ఆధారంగా టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం లేదని వివరించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.

నిగ్గుతేల్చే పనిలో ఇంటెలిజెన్స్

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆడియోను సైతం విడుదల చేశారు. అయితే అది ట్యాపింగ్ కాదు...రికార్డింగ్ మాత్రమే అంటూ వైసీపీ సమర్థించుకుంటుంది. అయినప్పటికీ ఈ అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ప్రతిపక్షం కూడా వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇలాంటి తరుణంలో నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాల సేకరిస్తున్నారు. అంతేకాదు శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డికి సంబంధించి కాల్‌డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు. అనంతరం రామ శివారెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిను సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News