Breaking: వామ్మో మళ్లీ అదే మహమ్మారి.. ఈసారి ఆత్మకూరు సీఐ హఠాన్మరణం
ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారిసంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ...
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారిసంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ గురై పలువురు మృతి చెందుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తున్నా సరే..ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నా సరే గుండెపోటు నుంచి మాత్రం తప్పించుకోలేక మృత్యువాత పడుతున్నారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒకరు, గ్రౌండ్లో షటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లి పీటల మీద ఇంకొకరు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు.. విధుల్లో ఉన్న బస్ కండక్టర్, కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు, కాలేజీలో క్లాస్ రూమ్‌కు వెళ్తూ ఇలా చాలా మంది గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు గుండె పోటు గురై మృతి చెందారు. డ్యూటీలో ఉండగా సీఐ నాగేశ్వరరావుకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సీఐ నాగేశ్వరరావు కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సీఐ నాగేశ్వరరావు గుండెపోటుకు గురై మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.