పవన్ కల్యాణ్ పై అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని ఎస్పీకి ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏర్పాటు చేసిన అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Update: 2023-05-30 15:46 GMT
పవన్ కల్యాణ్ పై అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని ఎస్పీకి ఫిర్యాదు
  • whatsapp icon

దిశ, నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని స్థానిక ఎస్పీ కార్యాలయం నందు నెల్లూరు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత మీద అభ్యంతరకర బ్యానర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాలో జన సైనికుల మీద కేసులు నమోదు చేయవద్దని జిల్లా ఎస్పీని దానికి అయన సానుకూలంగా స్పందిస్తూ ఇప్పుడు వరకు ఎక్కడ కేసులు పెట్టలేదు అని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నగరపాలక కమిషనర్ కు విషయాన్ని తెలియజేసిత్వరలో బ్యానర్లన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, వెంకటేష్, శ్రీకాంత్, ఉదయ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News