Tirumala Tickets Scam : తిరుమలలో ప్రత్యేక దర్శన టోకెన్ల స్కాం.. ఐదుగురి అరెస్ట్
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన(Srivari Special Darshanam) నకిలీ టికెట్లు(Fake Tickets) అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన(Srivari Special Darshanam) నకిలీ టికెట్లు(Fake Tickets) అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.300 టోకెన్లతో పలువురు దర్శనానికి వెళుతుండగా క్యూకాంప్లెక్స్ వద్ద అధికారులు అవి నకిలీ టోకెన్లుగా గుర్తించారు. విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. కొంతమంది ప్రత్యేక కౌంటర్ సిబ్బంది విధుల్లో ఉన్నపుడు బయటి వ్యక్తులతో కలిసి టోకెన్లను కలర్ జిరాక్స్ తీయించి.. వాటిని తిరుమలకు వచ్చే భక్తులకు టాక్సీ డ్రైవర్ల ద్వారా అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. కాగా బయటి వ్యక్తుల వద్ద దర్శన టోకెన్లు కొని మోస పోవవద్దని, కౌంటర్ల వద్ద మాత్రమే టోకెన్లు కొనాలని టీటీడీ(TTD) ఒక ప్రకటనలో పేర్కొంది.