స్కిల్ స్కాం కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.

Update: 2023-10-17 06:33 GMT
స్కిల్ స్కాం కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాంకేసులో బెయిల్ ఇవ్వాలని లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టగానే తమకు మరింత సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. 

Read More..

నన్ను కలవడానికి వస్తే నోటీసులివ్వడం ఏంటి?: నారా భువనేశ్వరి  

Tags:    

Similar News