ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల.. 57,923 మంది క్వాలిఫై

రాష్ట్రంలో ఇటీవల ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2023-02-28 08:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఇకపోతే ఫిబ్రవరి19న 411 ఎస్ఐ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 49,386 పురుషులు, 8,537 మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే పరీక్ష రాసిన అభ్యర్థులలో 38 శాతం మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో అయితే కటాఫ్ మార్కులను ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు 30 శాతం, బీసీలకు 35, ఓసీలకు 40 శాతంగా నిర్ణయించారు. ఇవన్నీ పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు దాదాపు 141 మంది పోటీ పడుతున్నారు.

ఇప్పటి వరకు అభ్యర్థుల నుంచి 1553 అభ్యంతరాలను స్వీకరించినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షా ఫలితాల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తమ వివరాల కోసం https://slprb.ap.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో దేహధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి. అలాగే ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News