AP News:‘ఆమెను కచ్చితంగా జైలుకు పంపిస్తాం’.. శాప్ చైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister RK Roja) రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు.
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister RK Roja) రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. ఈ రోజు(గురువారం) ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు(Ravi Naidu) మాట్లాడుతూ.. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఇక క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఫైరయ్యారు. టూరిజం శాఖ మంత్రి(Minister of Tourism) అయితే రోజు తిరుమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయిస్తారా? అని రవినాయుడు ప్రశ్నించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం అని పేర్కొన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవినాయుడు అన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా ఆమెను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.