ఆ ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
ఏపీలో గత కొద్దిరోజుల నుంచి తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత కొద్దిరోజుల నుంచి తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లడ్డూ వివాదం(dispute) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ వ్యవహారం పై చర్చలు కొనసాగుతున్న వేళ మరో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడ(Vijayawada) జిల్లాలోని దుర్గమ్మ ఆలయంలోని లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్లు బయటపడ్డాయి. తాజాగా ఈ దుర్గమ్మ లడ్డూ(Durgamma Laddu) ప్రసాదం పై తనిఖీలు నిర్వహించగా.. లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్ల పై లేబుల్స్ కనిపించడం లేదని వెల్లడైంది.
దుర్గమ్మ లడ్డూ(Durgamma Laddu) ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నాణ్యత లేదని గుర్తించిన అధికారులు 1,100 కిలోల కిస్మిస్, 700 కేజీల జీడిపప్పును రిటర్న్(Return) పంపించారు. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి(Cow ghee), బెల్లం(Jaggery), శనగపప్పు(groundnut) నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాద్‌కు పంపినట్లు తెలుస్తోంది.