తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. రేపు రాత్రికే తిరుమల చేరుకొని రాత్రికి అక్కడే బస చేసి.. మరుసటి రోజు దర్శనం చేసుకోనున్నారు. అంతేకాదు.. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాల ఉన్నాయనే ఆరోపణలు యావత్తు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కోట్లాది మంది భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది.