ఓవైపు చేతికి సెలైన్.. మరోవైపు ప్రజాసేవ.. ఎమ్మెల్యే నిబద్దతకు ప్రశంసలు

ఓవైపు చేతికి సెలైన్ పెట్టుకొని, మరోవైపు ప్రజాసేవలో నిమగ్నమైన ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Update: 2025-03-22 14:18 GMT
ఓవైపు చేతికి సెలైన్.. మరోవైపు ప్రజాసేవ.. ఎమ్మెల్యే నిబద్దతకు ప్రశంసలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఓవైపు చేతికి సెలైన్ పెట్టుకొని, మరోవైపు ప్రజాసేవలో నిమగ్నమైన ఎమ్మెల్యే (MLA)పై ప్రశంసలు (Praises) కురుస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో తమ సొంత పనులకు మించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సమయం ఇవ్వని ప్రజా ప్రతినిధులను చూస్తున్నాం. కానీ ఈ ఎమ్మెల్యే తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సేవకే ప్రథమ ప్రాధాన్యత అంటున్నాడు. ఓటు వేసి గెలిపించిన ప్రజలే తనకు ముఖ్యమని, వారి సమస్యలు తెలుసుకున్నాకే తన ఆరోగ్యం అంటూ.. నిజమైన ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ఉండాలి అని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ప్రకాశం జిల్లా (Prakasham District) మార్కాపురం ఎమ్మెల్యే (Markapuram MLA) ఓ చేతికి సెలైన్ ఎక్కుతుండగానే ప్రజా దర్బార్ లో పాల్గొన్నాడు. టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి (TDP MLA Kandula Narayana Reddy) గత మూడు రోజుల క్రితం శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో (MLA Office) ప్రజాదర్భార్ (Praja Darbhar) నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యాడు. అయితే ఇవాళ నిర్వహించాల్సిన ప్రజాదర్భార్ వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని ఆలోచించి, ప్రజాదర్భార్ కు అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. ఆరోగ్యం బాగలేకపోయినా ప్రజా దర్భార్ కు హజరయ్యారు. ఓ చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే.. మరో చేతితో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే చేసిన పనికి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


Similar News