Breaking:ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
దిశ,వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వంశీ పిటిషన్ పై నేడు (బుధవారం) కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు వంశీని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వంశీని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనివల్లే వంశీ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి తాజాగా ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయితే తాజాగా వంశీ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.