ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే?

ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Update: 2024-10-19 12:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి -2025లో పరీక్షలు రాయనున్న ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు ఈనెల 21 నుంచి నవంబర్‌ 11వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్‌ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇకపై గడువు అవకాశం ఉండదని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించామని వివరించారు. ఇంటర్‌ పరీక్షలు ప్రైవేటుగా రాయదలిచిన విద్యార్థులకు అటెండెన్స్‌ మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ వరకు రూ. 1500, నవంబర్‌ 30 వరకు పెనాల్టీతో రూ. 500 ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.


Similar News