Breaking:రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని, పోలవరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్జైజ్‌ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు.

Update: 2024-07-26 07:09 GMT
Breaking:రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని, పోలవరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాటి తీరుపై సవివరంగా వివరించారు. నేడు (శుక్రవారం) చివరిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలు తెలిపేందుకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనం కానున్నారు.

Tags:    

Similar News