ఏపీలో జోరుగా రిజిస్ట్రేషన్లు.. ఆదివారం కూడా భారీగా ఆదాయం

ఆంధ్రప్రదేశ్‌‌లో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు ఆగలేదు...

Update: 2025-03-31 11:08 GMT
ఏపీలో జోరుగా రిజిస్ట్రేషన్లు.. ఆదివారం కూడా భారీగా ఆదాయం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో సెలవు రోజు(Holyday) కూడా రిజిస్ట్రేషన్లు(Registrations) ఆగలేదు. భూములు, పొలాలు, ఇళ్లు, భారీగా క్రయ, విక్రయాలు జరిగాయి. దీంతో ఆదివారం ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం(Huge income) వచ్చింది. ఉగాది(Ugadi), పైగా ఆదివారం(Sunday) అయినప్పటికీ కొనుగోలుదారులు వెనక్కి తగ్గలేదు. భారీగా ఆస్తులు కొనుగోళ్లు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.8 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.2 కోట్ల ఆదాయంతో గుంటూరు జిల్లా టాప్‌గా నిలిచింది. సాధారణ రోజుల్లో రూ.30-40 కోట్ల మధ్య ఆదాయం వస్తుంది. ఆర్థిక సంవత్సరం(Financial year) చివరి రోజు కావడంతో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు కొనసాగాయి. దీంతో పొలాలు, స్థలాలు, ఇళ్లు భారీగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో రాష్ట్రానికి నిన్న ఒక్క రోజే భారీగా ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News