విశాఖ విమానాశ్రయం రన్‌వే మూసివేత వ్యవధిని తగ్గించండి: ఈఎన్‌సీ చీఫ్‌తో ఎంపీ జీవీఎల్ భేటీ

విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వే మూసివేత వ్యవధిని తగ్గించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.

Update: 2023-11-09 10:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వే మూసివేత వ్యవధిని తగ్గించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఈ మేరకు తూర్పు నావికా దళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంథార్కర్‌తో ఎంపీ జీవీఎల్ నరసింహారావును కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వేని నవంబరు 15 నుంచి రాత్రికి మూసివేసే విషయమై తూర్పు నౌకాదళ కమాండ్ ఎఫ్‌ఓసీ ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌తో చర్చించారు. విశాఖ విమానాశ్రయం రన్ వే పునరుద్ధరణ కోసం రాత్రి మూసివేయడంపై తూర్పు నావికా దళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంథార్కర్‌తో చర్చించారు. అయితే పగటిపూట విమాన కార్యకలాపాలను పెంచడానికి మరింత ఏటీసీ సిబ్బందిని మోహరించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఈఎన్‌సీ చీఫ్ రాజేశ్ పెంథార్కర్ వెల్లడించారు. మరిన్ని విమానాల నిర్వహణకు వీలుగా రన్‌వేను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేసే సమయాన్ని తగ్గించగలరా అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరా తీశారు. రోజువారీగా రన్‌వే యొక్క ఉపరితలం మరియు క్యూరింగ్ కోసం ప్రకటించిన మూసివేత గంటలు ఖచ్చితంగా అవసరమని ఈఎన్‌సీ చీఫ్ రాజేశ్ పెంథార్కర్ వెల్లడించారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ సమయాన్ని తగ్గించడం సాధ్యం కాదు అని తెలిపారు. ఇతర రక్షణ విమానాశ్రయాల కంటే విశాఖపట్నం విమానాశ్రయంలో పునరుద్ధరణ కార్యకలాపాలు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని అడిగిన ప్రశ్నకు, విశాఖపట్నం ఎయిర్‌ఫీల్డ్‌కు ఇతర పెద్ద విమానాశ్రయాల మాదిరిగా సమాంతర టాక్సీ ట్రాక్ లేదని, దీని వల్ల విశాఖపట్నం విమానాశ్రయంలో ఉపరితల కార్యకలాపాలకు ఎక్కువ సమయం పడుతుందని ఈఎన్సీ చీఫ్ రాజేశ్ పెంథార్కర్ పేర్కొన్నారు.

రన్‌వే మూసివేతపై ఎంపీ జీవీఎల్ ఆందోళన

విశాఖపట్నం ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ నుండి మూడు విమానాలు రన్‌వే మూసివేత కారణంగా రద్దు చేయబడ్డాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. పగటిపూట మరిన్ని విమానాలు నడపడానికి టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయని...పగటి సమయంలో విమానాల సంఖ్యను పెంచడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో అదనపు సిబ్బందిని మోహరించడానికి ఈఎన్‌సీ సిద్ధంగా ఉందని ఈఎన్‌సీ చీఫ్ రాజేశ్ పెంథార్కర్ వెల్లడించారు. ఈఎన్‌సీ చీఫ్‌తో చర్చల అనంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ...మూసివేసే సమయం, వ్యవధిలో ఎలాంటి జాప్యాలు, అంతరాయాలు ఉండవని హామీ ఇచ్చారని తెలిపారు. 10ఏళ్ల క్రితం చేపట్టిన పునరుద్ధరణ పని పౌర ప్రయాణికుల భద్రత మరియు రక్షణ కార్యకలాపాలకు ఖచ్చితంగా అవసరమని ఈఎన్‌సీ చీఫ్ అంగీకరించినట్లు తెలిపారు. విమాన కార్యకలాపాలను పెంచడానికి మరియు పునరుద్ధరణ కార్యకలాపాల కోసం రన్‌వేను మూసివేయవలసిన ఆవశ్యకతపై ప్రజలు మరియు వ్యాపారాలలో అవగాహన కల్పించడానికి అన్ని వాటాదారులతో సంప్రదింపులు నిర్వహించాలని ఎంపీ జీవీఎల్ ఈఎన్‌సీ చీఫ్ రాజేశ్ పెంథార్కర్‌ను కోరారు. 

Tags:    

Similar News