బ్రేకింగ్: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్..!
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సఖినేటిపల్లి గ్రామంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ ఎమెల్యే అందుబాటులో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు ఆ కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేశారు. కాగా, ఎమ్మెల్యే రాపాక చేసిన దొంగ ఓట్ల వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన అనుచరులు దొంగ ఓట్లు వేసి తనను గెలిచిపించారని రాపాక తీవ్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం టీడీపీపై రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేయాలని అడిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మరోపక్కా సొంత నియోజకవర్గంలో ఆయనపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. రాపాకకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఇవాళ రాజోలులో ఆందోళన చేపట్టారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యే రాపాక అంటూ నిరసన వ్యక్తం చేశారు.