పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు అందించింది. రోహిణీ కార్తె ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Update: 2023-05-29 09:53 GMT
పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు అందించింది. రోహిణీ కార్తె ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనాకపల్లి, వైఎస్‌ఆర్ జిల్లా, కర్నూల్, అనంత, శ్రీకాకులం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయంట. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News