నదీ తీర ప్రాంతంలో రొయ్యల సాగు.. వరద భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు

నది తీర ప్రాంతంలో కరకట్లకు దిగువ ప్రాంతంలో రొయ్యల చెరువులు తవ్వుకుని రొయ్యల సాగు కొందరు రైతులు చేసుకోవడంతో ఆ తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Update: 2024-11-23 12:50 GMT

దిశ, పాలకొల్లు: నది తీర ప్రాంతంలో కరకట్లకు దిగువ ప్రాంతంలో రొయ్యల చెరువులు తవ్వుకుని రొయ్యల సాగు కొందరు రైతులు చేసుకోవడంతో ఆ తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం నుంచి నరసాపురం వద్ద గల బియ్యపు తిప్పవరపు వశిష్ట నది వెంబడే కరకట్ట అనగా ఏటి గట్టు దిగువ భాగంలో ఈ రొయ్యల సాగు చేసుకోవడంతో ఏటిగట్లు బలహీనపడి వరదలు వస్తాయనే భయంతో ఆ తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు, పాలకులు:

ఏటుగట్లు దిగు ప్రాంతంలో ప్రజల చెరువులు తవ్వుకుని రొయ్యల సాగు చేసుకుంటున్న సంబంధిత అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటి గట్టు ఈ చెరువుల కారణంగా బలహీన పడుతున్న ఎవరికి చీమ కుట్టినట్లు బాధ కూడా లేకపోవడం దురదృష్టకరం అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. ప్రభుత్వ భూములు, గట్టు ఆక్రమించి సాగుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాలు చేస్తున్న ప్రభుత్వం నది తీర ప్రాంతంలో వశిష్ట నది వెంబడి రొయ్యల సాగులు చేస్తున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి కాదా అని ప్రశ్నించారు. అవసరమైతే వారు నష్ట పోకుండా వారికి కొంత టైం ఇచ్చి రాబోయే కాలంలో అయిన రొయ్యల చెరువులు వేయకుండా వేసిన చెరువులో మట్టితో గుంతలు పూడ్చే చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Similar News