AP NEWS:ఏలూరు రహదారులకు మహర్దశ
యుద్ధ ప్రాతిపదికన ఏలూరు నగరంలో రోడ్లు మరమ్మతులు, మేజర్ డ్రైనేజీలో షీల్డ్ తొలగించే పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు అన్నారు.
దిశ, ఏలూరు:యుద్ధ ప్రాతిపదికన ఏలూరు నగరంలో రోడ్లు మరమ్మతులు, మేజర్ డ్రైనేజీలో షీల్డ్ తొలగించే పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఆదేశాల మేరకు 80 లక్షల రూపాయలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి నగరంలో ప్రధాన రోడ్డు మరమ్మత్తులు, మేజర్ డ్రైనేజీలో ఉన్న సిల్ట్ తొలగించడం జరుగుతుందని పెదబాబు అన్నారు. గురువారం ఆయన అధికారులతో కలిసి నగరంలో పలు చోట్ల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజుల క్రితం పనులు ప్రారంభించడం జరిగిందని వర్షాలు కారణంగా మధ్యలో పనులు ఆలస్యం అయిందన్నారు.
వన్ టౌన్, టూ టౌన్ ప్రాంతాల్లో సుమారు 13 మేజర్ డ్రైనేజీల్లో షిల్ట్ తొలగిస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల మరమ్మతులకు చేస్తున్నామన్నారు. మేజర్ డ్రైనేజీల్లో బ్రాందీ షాపుల దగ్గర సీసాలు, కూల్ డ్రింక్ షాపుల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉండటం కారణంగా డ్రైనేజీలు పూడుకుపోయి వర్షపు నీరు రోడ్ల పై పొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. షాపు యజమానులు, ప్రజలు డ్రైనేజీల్లో వ్యర్థాలు వేయకుండా కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ తాతబ్బాయి, ఏ.ఈ రఫీ, కార్పొరేటర్లు బత్తిని విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, నున్న కిషోర్, దారపు తేజ, ఆరేపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.