Delhi Liquor Case: మాగుంట రాఘవకు చుక్కెదురు

Update: 2023-04-20 16:55 GMT
Delhi Liquor Case: మాగుంట రాఘవకు చుక్కెదురు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్నారు. ఇక మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు రాఘవపైనా అభియోగాలు చేశారు. ఈడీ కేసుకు సంబంధించి రాఘవ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లనూ ఇప్పటికే కోర్టు తిరస్కరించింది.

కాగా ఏప్రిల్ 12న జరిగిన విచారణలో ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. తమ ఎదుట మాగుంట రాఘవ తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని, కీలక సాక్ష్యాన్ని సైతం నాశనం చేశారని  ఛార్జిషీట్‌లో ఈడీ  తెలిపింది. ఫిబ్రవరి 10న ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను సుధీర్ఘంగా విచారించిన అధికారులు మాగుంట రాఘవను నిందితుడిగా చేర్చుతూ  కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News