Breaking: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ఎదురుదెబ్బ.. అధిష్టానం సీరియస్ వార్నింగ్

ఒంగోలులో వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడ్డారు. దీంతో సీఎంవో సీరియస్‌ అయింది....

Update: 2023-10-19 15:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలులో వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడ్డారు. దీంతో సీఎంవో సీరియస్‌ అయింది. ఇద్దరు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు అనుచరులపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు అనుచరులను సస్పెండ్ చేస్తూ కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనే ఆవేదనలో ఉన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసేందుకు బాలినేని శ్రీనివాసరావు తాడేపల్లికి వెళ్లారు.

అయితే సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. పైగా బాలినేనికి సీఎంవో క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో జరిగిన కబ్జా విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. జిల్లా ఎస్పీని మార్చే అవకాశమే లేదని తేల్చి చెప్పినట్లు వినికిడి వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రతి సారి అసంతృప్తి అంటూ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దని బాలినేనిని సీఎంవో హెచ్చరించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే మాజీ మంత్రి, ఎమ్మల్యే బాలినేని పట్ల అధిష్టానం సానుకూలంగా లేదనేది స్పష్టంగా అర్ధమవుతోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకన్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరావు తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News