AP:డీపీఆర్వోకు ఉత్తమ సేవా పతకం..స్వాతంత్య్ర వేడుకల్లో అందజేసిన మంత్రి

జిల్లాలో ఉత్తమ సేవలందించిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) ఆర్వీఎస్ రామచంద్రరావు జిల్లా అధికారుల విభాగంలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు.

Update: 2024-08-15 13:14 GMT

దిశ, ఏలూరు:జిల్లాలో ఉత్తమ సేవలందించిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) ఆర్వీఎస్ రామచంద్రరావు జిల్లా అధికారుల విభాగంలో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉత్తమ సేవా పతకాన్ని డీపీఆర్వోకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో అందజేశారు. అలాగే సమాచార శాఖలో డివిజనల్ పిఆర్ఓ సిహెచ్.కె. దుర్గాప్రసాద్, సహాయక సమాచార ఇంజనీరు కె. ధనుంజయ రాజు, ఉత్తమ ఫొటో గ్రాఫర్ పి.సాగర్ ఉత్తమ సేవా పతకాలను మంత్రి పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో అందించారు.


Similar News