Prakasham Barrage: ప్లాన్ సక్సెస్..ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న ఓ భారీ బోటును తొలగించిన ఇంజినీర్లు

కృష్ణా నది(Krishna River)లో ఈ నెల 1వ తేదీన వచ్చిన భారీ వరద ప్రవాహానికి 5 బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) గేట్ల వద్ద చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-17 19:25 GMT

దిశ, వెబ్‌డెస్క్:కృష్ణా నది(Krishna River)లో ఈ నెల 1వ తేదీన వచ్చిన భారీ వరద ప్రవాహానికి భారీ బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) గేట్ల వద్ద చిక్కుకున్న సంగతి తెలిసిందే.గత ఏడు రోజులుగా ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్నఈ బోట్లను తొలగించడానికి ఇంజినీర్లు, అధికారులు అనేక ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది.మంగళవారం రాత్రి 40 టన్నుల భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా(Bekem Infra) సంస్థ ఇంజినీర్లు బయటకు తెచ్చారు. అయితే అధికారులు ఇప్పటివరకు వివిధ ప్లాన్ లతో బోట్లను తొలగించడానికి ప్రయత్నించగా నిరాశే ఎదురయ్యింది.అయితే ఈ సారి ఇంజినీర్లు సరికొత్త వ్యూహంతో ఓ బోటును తొలగించారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లను అమర్చి చిక్కుకున్న బోటును బయటకు తీసుకొచ్చారు.కాగా బ్యారేజీ వద్ద ఇంకా రెండు భారీ బోట్లు, మరో చిన్న బోటు చిక్కుకొని ఉన్నాయి. ఈ బోట్లను రేపు ఇంజినీర్లు బయటకు తీసే అవకాశముంది.     


Similar News