అమరావతికి పవన్ .. ఢిల్లీకి సీఎం జగన్.. వేంగంగా మారుతున్న రాజకీయాలు
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి..
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల పొత్తు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ ఒంటరిగా ఎన్నికలు వెళ్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నాయి. అయితే బీజేపీ కూడా టీడీపీ, జనసేన జతలో కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు చెబుతున్నాయి. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ ఆగ్రనేతలతో కలిసి చర్చలు జరుపుతున్నారు.
ఇవాళ సీఎం జగన్ సైతం ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి హస్తినకు బయల్దేరి వెళ్లారు. బీజేపీ పెద్దలను కలవనున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం అమరావతికి బయల్దేరి వెళ్లనున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఉన్న ఆయన మరికొద్దిసేపట్లో గంగవరం ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. అనంతరం మంగళగిరి జనసేన కార్యాయానికి చేరుకోనున్నారు. పొత్తులు, సర్వేలపై పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికపైనా పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు.
ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎవరిది గెలుపు అనే అంశంపై గురువారం పలు సర్వేలు బయటకు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపాయి.
Also Read..
ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన జగన్ భేటీ.. ఎనిమిది అంశాలతో వినతి పత్రం అందజేత