Breaking:టీడీపీ ఆఫీస్‌లో పోలీసుల విచారణ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-01 08:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వై నాట్ 175 స్థానాల్లో గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే గత ప్రభుత్వంలో అల్లర్లు, దాడుల పై ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో నేడు (సోమవారం) మంగళగిరి లోని టీడీపీ ఆఫీసు పై 2021లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


Similar News