Breaking: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

గుంటూరు జిల్లా మంళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు...

Update: 2024-07-06 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల ఒత్తిడితో కేసును పక్కకు పెట్టిన పోలీసులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కేసులో విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ కార్యాలయంలోపై జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురు నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతల కీలక అనుచరులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సింది ఉందని, పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని మంగళగిరి అర్బన్ పోలీసులు తెలిపారు. 


Similar News