తిరుపతిలో మీడియా పై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు.

Update: 2024-05-14 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిపై.. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని తమ నేతపై చేసిన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జులిపించారు. దీంతో స్థానిక సీఐ దురుసు ప్రవర్తన ను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది.


Similar News