టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి కనబడుట లేదంటూ ప్లెక్సీ

తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది.

Update: 2024-09-27 08:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ వివాదంలో ఏపీ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనబడుట లేదంటూ ప్లెక్సీ విడుదల చేయడం వైరల్ గా మారింది. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతిని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. మాజీ ఈవోలు కేఎస్. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని విమర్శించారు. లడ్డూ వివాదంపై సిట్ వేగంగా దర్యాప్తు చేసి అనుమానాలు, చర్చలకు పుల్ స్టాఫ్ పెట్టాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇకనైనా అర్చకులు, జీయర్లు అధికారంలో ఉన్న వారికి వంతపాడకుండా ఆలయ సాంప్రదాయాలను గౌరవించేలా చూడాలని కోరారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని..డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రనా మతం మారిపోదన్నారు. గత వైసీపీ పాలనలో తిరుమలలో ఎన్నో అపచారాలు చోటుచేసుకున్నాయని, వాటిపై మేం ప్రశ్నిస్తే మాపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. 


Similar News