అంగన్‌వాడీలకు అండగా జనసేన.. ప్రభుత్వ తీరుపై పవన్ ఆగ్రహం
అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని.. లేదంటే తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశిండాన్ని జనసేన ఖండించింది..
దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీలు విధుల్లో చేరాలని.. లేదంటే తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంగన్‌వాడీలకు అండగా ఉంటామని ప్రకటించింది. అంగన్ వాడీలను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా ఉందని ఆయన మండిపడ్డారు. నామ మాత్రపు వేతనాలతో సేవలందిస్తున్ మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు చేయకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందని పవన్ ఎద్దేవా చేశారు. సీఎం కోటి సంతకాలతో కూడిన వినతి పత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసుల అంగన్ వాడీలను ఈడ్చి వేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ సిబ్బందిని అరెస్టులు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందని పవన్ పేర్కొన్నారు.
అంగన్వాడీలపై ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/TcoEMUNDBu
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2024