NTR Satha Jayanthi Celebrations: నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం

నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని శకపురుషుడు సావనీర్‌, ‘జయహో ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు...

Update: 2023-05-15 10:27 GMT
NTR Satha Jayanthi Celebrations: నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ మే 20 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి, హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్‌, ‘జయహో ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు, జూనియర్‌ ఎన్టీఆర్, నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠంనేని ఉమాశ్రీనివాస్‌ ప్రసాద్, నందమూరి కళ్యాణ్‌ చక్రవర్తి, నందమూరి కళ్యాణ్‌రామ్‌, కాట్రగడ్డ రుక్మాంగదరావులను కమిటీ చైర్మన్‌ టీడీ జనార్థన్‌ కలిసి ఆహ్వాన పత్రాలు అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More:   Bandla ganesh : జాతీయ పార్టీలోకి బండ్ల గణేశ్.. తెలంగాణలో ఆ స్థానం నుంచి పోటీ?

Tags:    

Similar News