SEC:‘స్థానిక’ ఎన్నికల నగరా.. ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది.

Update: 2025-03-19 12:27 GMT
SEC:‘స్థానిక’ ఎన్నికల నగరా.. ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) కడప జడ్పీ చైర్‎పర్సన్, కర్నూలు జడ్పీ కో-ఆప్టెడ్ మెంబర్స్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్‎లో 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, 214 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 23లోగా సంబంధిత మెంబర్లకు నోటీసులు జారీ చేస్తామని, ఈ నెల(మార్చి) 27వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Tags:    

Similar News