వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడండి:నారా లోకేష్

మూడు రాజధానుల పేరిట ఆంధ్ర ప్రదేశ్ ను మూడు ముక్కలాట గా చేసిన జగన్ కు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధం కావాలని కార్యకర్తలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Update: 2024-03-08 10:46 GMT

దిశ,మడకశిర:మూడు రాజధానుల పేరిట ఆంధ్ర ప్రదేశ్ ను మూడు ముక్కలాట గా చేసిన జగన్ కు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధం కావాలని కార్యకర్తలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గురువారం మడకశిర నగర పంచాయతీ పరిధిలోని చీపులేటి గ్రామ సమీపంలో శంఖారావం సభను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు గా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలను పట్టి పీడిస్తోందని ఆ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుకు పట్టం కట్టారని కార్యకర్తలతో పేర్కొన్నారు. బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయని మహిళలు ఆనందం చెందుతుంటే మళ్లీ రెడ్ బటన్ నొక్కి అందులో 90% నిధులను తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు.

వివేకానంద రెడ్డి హత్య కేసును తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నిందితులను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు అరెస్టు చేస్తే తొలుత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కానీ అతను చంద్రబాబును పలకరించడానికి వస్తే అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు కలిగించి కలువ లేకుండా చేశారని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, రైతులకు 25 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి అందుకు అవసరమైన ఐదు లక్షల కోట్ల నిధులను కూడా కేటాయించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా శాశ్వతంగా బీసీ కుల ధృవీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లాకు పరిశ్రమలు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా ప్రజలు అంటే తమ కుటుంబానికి ఎనలేని అభిమానమని ఆయన పేర్కొన్నారు.నియోజకవర్గంలో పిల్ల కాలువలు ఏర్పాటు చేసి చెరువులకు నీరు అందిస్తామని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ,అర్ధాంతరంగా ఆగిపోయిన గురుకుల పాఠశాలను పూర్తి చేస్తామని, పట్టు రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత కార్యకర్తలు కూడా అంగన్వాడీ పోస్టులు ఇవ్వకుండా అమ్ముకున్న ఘనత ఈ ఎమ్మెల్యేకు దక్కుతుందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ల ముందుగా కప్పం చెల్లించకపోతే పనులు చేయించారని ఈ నేపథ్యంలోనే ఏ కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రాలేదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నుంచి వసూల్ రాజా అంటూ నామకరణం చేయడంతో ఆయన సైతం వసూల్ రాజా ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. ఎన్నికలు జరగడానికి కేవలం 42 రోజులు గడువు ఉందని కావున పది రోజుల్లో క్లస్టర్ వారి ఇన్చార్జులు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం మేనిఫెస్టోను తెలియజేయాలని ఆయన కోరారు. పనిచేసిన వారికి గుర్తించి పదవులు కట్టబెట్టడం జరుగుతుందని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పార్థసారథి జనసేన అధ్యక్షుడు వరుణ్ ,మాజీ ఎమ్మెల్యే ఈరన్న స్థానిక జనసేన అధ్యక్షుడు రంగస్వామి ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Read More..

Delhi: కాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ 

Tags:    

Similar News