AP Elections 2024: అంబటి రాయుడు రాజీనామా ఇచ్చి మంచి పని చేసారు.. ఎంపీ రఘురామకృష్ణరాజు
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం అందరికి సుపరిచితమే.
దిశవెబ్ డిస్క్: ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే ఎవరు ఊహించని రీతిలో పార్టీ లో చేరిన 10 రోజులకే ఆయన పార్టీకి రాజీనామా చేసి సంచలం సృష్టించాడు. కాగా తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీని పై తాజాగా వైసీపీ రెబల్ AP Elections 2024 స్పందించారు. జగన్ ని అర్ధం చేసుకోవడానికి తనకి 6 నెలల సమయం పట్టిందన్నారు. అలానే మిగిలిన నేతలకు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. కానీ రాయుడు కి మాత్రం 10 రోజుల్లోనే జగన్ మనస్తత్వం అర్థమైందన్నారు.
మహనీయుడైన ముఖ్యమంత్రి మహనీయ వ్యక్తిత్వాన్ని.. ఆయన దాన గుణాన్ని.. ప్రజలను ప్రేమించే విధానాన్ని రాయుడు కనిపెట్టేశాడని వ్యంగ్యముగా మాట్లాడారు. అయితే రాయుడు రాజీనామా ఇవ్వడంతో పలువురు పలురకాలుగా అభిప్రాయపడవచ్చు. క్రికెటర్ 200 పరుగులు చేస్తాడనుకుంటే బ్యాటింగ్ కే రాకుండా పోయాడేంటి అని అనిపించవచ్చు.. హిట్ వికెట్ అయ్యాడేంటి అని మాట్లాడుకోవచ్చు. కానీ రాయుడు రాజీనామా ఇచ్చి చాల మంచి పని చేసాడు. ఎంతైనా ఆటగాడు కదా.. రాబోయే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును ముందుగానే అంచనా వేసాడు. ఓడిపోయే మ్యాచ్ ఆడకపోవడమే మంచిదనుకుని రాజీనామా చేశారు. మునిగిపోతున్న వైసీపీ నావ నుంచి అరక్షణం ఆలస్యం చేయకుండా బయటికి వచ్చేశాడు అని రఘురామ పేర్కొన్నారు.