AP News:బియ్యం అక్రమ రవాణా పై పవన్ సీరియస్.. స్పందించిన ఎంపీ పురందేశ్వరి

ఏపీలోని కాకినాడ పోర్టును శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సందర్శించిన విషయం తెలిసిందే.

Update: 2024-11-30 09:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని కాకినాడ పోర్టును శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) పై సీరియస్ అయ్యారు. అయితే తాజాగా బియ్యం అక్రమ రవాణా పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeshwari) స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు(Kakinada Port)ను కేంద్రంగా చేసుకొని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశం పై తాము గతంలో కూడా ప్రశ్నించామని ఆమె గుర్తించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో నిల్వలు బయట పడ్డాయన్నారు. ఇవన్నీ కాకినాడ పోర్టు నుంచి నౌకల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారని ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News