Mp Avinash Reddy: తప్పుదోవ పడుతోంది.. సీబీఐ విచారణపై సంచలన వ్యాఖ్యలు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు..

Update: 2023-03-10 10:14 GMT
Mp Avinash Reddy: తప్పుదోవ పడుతోంది.. సీబీఐ విచారణపై సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు అధికారులు విచారించారు. తాజాగా మూడోసారి కూడా అవినాశ్ రెడ్డిని విచారించారు. ఈ ఉదయం విచారణకు హాజరైన ఆయనను సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఆయన సానుకూలంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

సీబీఐ విచారణపై సంచలన వ్యాఖ్యలు

సీబీఐ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ తప్పుదోవ పడుతోందన్నారు. వ్యక్తి టార్గెట్‌గా విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐ తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. కట్టు కథను అడ్డం పెట్టుకుని విచారణకు పిలుస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. కీలక విషయాలు పక్కన బెట్టి తనను విచారిస్తున్నారన్నారు. మరోసారి కూడా విచారణకు రావాలని సీబీఐ అధికారులు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట

మరోవైపు తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట లభించింది. అవినాశ్ రెడ్డి అరెస్ట్‌పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానందారెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకూదని సీబీఐకి ఆదేశాలివ్వాలంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన వేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మసనం.. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సూచించింది. అవినాశ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

Read more:

Breaking: ఆస్తుల కోసమే వివేకా హత్య.. సంచలన విషయం చెప్పిన అవినాశ్ రెడ్డి 

Tags:    

Similar News