AP MLC Election: ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఎంతమంది ఓటేశారంటే..

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్​సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

Update: 2025-02-27 11:27 GMT
AP MLC Election: ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఎంతమంది ఓటేశారంటే..
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (graduate mlc election) పోలింగ్​సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఇప్పటికే క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. కాగా బ్యాలెట్​పద్ధతిలో ఓటింగ్​జరుగుతుండడంతో పోలింగ్ శాతం వెంటనే వెలువడడం లేదు. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కంపు జరగనుంది. కాగా రెండుమూడు చోట్ల స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడి ఆలపాటి రాజా, లక్ష్మణరావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం బరిలో 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ శాతం మధ్యాహ్నం 2గంటల వరకు.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ - 79.54%  గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ - 49% ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ - 43.2% గా నమోదైంది.

Tags:    

Similar News