గనుల పేరుతో భారీ స్కాం.. చిక్కుల్లో ఏపీ మాజీ మంత్రి ఫ్యామిలీ

ఏపీలో గనుల పేరుతో భారీ స్కాం జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు...

Update: 2024-07-04 13:36 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గనుల పేరుతో భారీ స్కాం జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. మంగంపేట ముగ్గురాయి గనుల్లో అక్రమాలు జరిగాయని, విచారణ జరపాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎంపెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా రూ.2 వేల కోట్లు దోపిడీ చేసిందని ఫిర్యాదులో ఈ మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. పేర్కొన్నారు. వెంటనే విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ‌గోపాల్ రెడ్డి కోరారు.


కాగా కడప జిల్లా మంగంపేటలో ఉన్న ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. కోటి మెట్రిక్ టన్నుల ఏ.బీ.సీ.డీ గ్రేడ్ల ముగ్గుయి విక్రయాల టెండర్లను అప్పటి అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు. 10 వేల టన్నులకుపైగా ముగ్గురాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారని, అందులో వేల కోట్ల దోపిడీ జరిగిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే గనుల అక్రమాలపై విచారణ జరుపుతామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో మంగంపేట ముగ్గురాయి గనుల్లో జరిగిన అక్రమాలపై విచారణపై దృష్టి సారించారు. 


Similar News