ఏనుగుల దాడిలో రైతు మృతి.. రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎమ్మెల్యే

ఏనుగుల దాడిలో మృతి చెందిన రైతు యాకోబు కుటుంబానికి ఎమ్మెల్యే విజయ్ చందర్ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు..

Update: 2024-10-24 16:59 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు యాకోబును ఏనుగులు వెంటాడి చంపిన విషయం తెలిసిందే. అయితే యాకోబు కుటుంబానికి ఎమ్మెల్యే బోనెల విజ‌య్ చందర్ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేకాదు శుక్రవారం ఉద‌యం అంద‌జేస్తాన‌ని తెలిపారు. ఏనుగులు సంచ‌రిస్తున్న ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లొద్దని సూచించారు. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌క్షణ‌మే స్పందిస్తామని విజ‌య్ చందర్ స్పష్టం చేశారు.

కాగా పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో దారుణం జరిగింది. రైతు యాకోబును ఏనుగులు(Elephants) వెంటాడి చంపాయి. అటవీప్రాంతం(forest area)లో నుంచి పెదబొండపల్లి(Pedabondapalli) పొలాల సమీపంలోకి వచ్చాయి. పొలంలో ఉన్న రైతు యాకోబ్‌ను చూసిన ఏనుగులు పెద్దగా శబ్ధాలు చేస్తూ ఆయన వైపు వెళ్లాయి. దీంతో యాకోబ్‌ అక్కడి నుంచే వెళ్లిపోయే ప్రయత్నం చేశారు, కానీ రైతుపై దాడి చేసి చంపాయి. అనంతరం పెదబొండపల్లిలోకి వెళ్లాయి. గ్రామస్తులను ఏనుగులు వెంబడించాయి. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. చివరకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. 


Similar News