తొడగొడితే కుర్చీ రావడానికి ఇది సినిమా కాదు.. వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే.

Update: 2024-02-06 07:50 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన సమావేశాల్లో టీడీపీ నేతల పై అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా తీర్మానం పై, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అయితే ప్రజల తరుపున ప్రజాసమస్యల పై చర్చించాలని టీడీపీ నేతలు సూచిస్తున్న స్పీకర్ వినిపించుకోలేదు.

ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు పేపర్లు చింపి , విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకొని పెద్దగా నిదాలు చేశారు. అయితే  వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో.. టీడీపీ సభ్యులు ప్రజాసమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగానికి అంతరాయం కలిగినందుకు ఆగ్రహానికి గురైన అబ్బయ్య చౌదరి టీడీపీ సభ్యుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ కు మర్యాద ఇవ్వడం కూడా టీడీపీ సభ్యులకు తెలియదని దుయ్యబట్టారు. టీపీడీకి కుర్చీ మీద వ్యామోహం అని.. అందుకే స్పీకర్ కుర్చీ దగ్గరకి వెళ్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ని వెన్ను పోటు పొడిచి కుర్చీలాక్కున్న తేలిక కాదు ఇప్పుడు కుర్చీ తీసుకోవడం అని మండిపడ్డారు. ఇక బాలకృష్ణని ఉద్దేశిస్తూ తొడ గొడితే కుర్చీలు రావడానికి ఇది సినిమా కాదు అని.. ప్రజల మన్ననలు పొందితేనే కుర్చీ అని ఎద్దేవ చేశారు. ఇక టీడీపీ సభ్యుల నిరసన వల్ల సభలో అంతరాయం కలిగిందని టీపీడీ సభ్యులను స్పీకర్ ఒక రోజు సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News