AP News:ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకంపై మంత్రి కీలక ప్రకటన..!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Update: 2024-07-24 09:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. నేడు (బుధవారం) ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో చెప్పారు. సంబంధిత శాఖలతో చర్చించుకుని త్వరలో ఈ పథకం పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ఎన్డీయే హామీ ఇచ్చింది. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా 361 మంది లబ్ధిదారులకు మొదట ఉచిత ఎల్పీజీ సిలిండర్లతో పాటు ఉచిత గ్యాస్ కలెక్షన్స్ రాష్ట్రంలో ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Tags:    

Similar News