‘గుడివాడలో గడ్డం గ్యాంగ్ దోపిడీ’..మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు..?

ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై దృష్టి సారించింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-04 13:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై దృష్టి సారించింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. గత వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ దోపీడి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జనం సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గడ్డం గ్యాంగ్‌కు అడ్డు అదుపు లేకుండా దోచుకోవడమే పని అని నారా లోకేశ్ విమర్శించారు. టిడ్కో ఇళ్ల ప్రారంభంలో నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు దోచేశారని ఆరోపించారు. ఇళ్ల మంజూరుకు రూ.4లక్షలు దండుకున్నారని విమర్శించారు. బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని దుయ్యబట్టారు. రూ.70 లక్షల బిల్లుల కోసం విశ్వప్రయత్నాలు చేసిందని, అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు.


Similar News