Nara Lokesh:‘5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశంలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రసంగిస్తూ ఉద్యోగాల కల్పన పై కీలక వ్యాఖ్యలు చేశారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్(Minister Lokesh) అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలు(NDA MLA) సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ నేపథ్యంలో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం భోగాపురం ఎయిర్ పోర్టు పనులను పరిగెత్తిస్తున్నాం అని మంత్రి తెలిపారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ రోజు(గురువారం) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున హోటళ్లు తీసుకొస్తామన్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.