శ్రీనివాసులను కక్షతోనే చంపేశారు.. నారా లోకేశ్ సంచలన ట్వీట్

ర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను కక్షతోనే చంపేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు...

Update: 2024-08-14 04:28 GMT
శ్రీనివాసులను కక్షతోనే చంపేశారు.. నారా లోకేశ్ సంచలన ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను కక్షతోనే చంపేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీనివాసుల కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపిన నేపథ్యంలో ఆయన స్పందించారు. శ్రీనివాసుల హత్యను నారా లోకేశ్ ఖండించారు. ఎన్నిక్లలో తెలుగుదేశం పార్టీ తరపున పని చేశారనే కక్షతోనే శ్రీనివాసులను హత్య చేశారని ఆరోపించారు. హత్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. శ్రీనివాసులు కుటుంబానికి అండగా ఉంటామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.


ఇక శ్రీనివాసులు హత్యతో హోసూరులో ఒక్కసారిగా పొలిటికల్ కాక రేగింది. శ్రీనివాసులను చంపింది వైసీపీ కార్యకర్తలేనని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

అయితే శ్రీనివాసుల హత్యతో హోసూరులో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆందోళనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీనివాసుల హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News