తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు: మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు..

Update: 2025-04-04 10:33 GMT
తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు: మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని(Talliki Vandhanam Scheme) అమలు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి(Addanki)లో ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(Prakasam Government Girls High School)లో విద్యార్థినులకు అసిస్ట్ సంస్థ సహకారంతో 309 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో పాఠశాలలో అభివృద్ధి కోసం మంత్రి లోకేశ్ బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. దూరభారంతో చదువు మానివేయకుండా వేళకు క్రమం తప్పకుండా స్కూల్‌కు వెళ్లేందుకు ఈ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయన్నారు. మున్ముందు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసి, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలోని మిగతా పాఠశాలల్లో కూడా పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 

అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్  ప్రజావేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 89 మంది లబ్దిదారులకు రూ. కోటీ 38 లక్షలు పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి ద్వారా ఎన్నో కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలుస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసానిస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

Tags:    

Similar News