Odisha Rail Incident: ఏపీ వాసులు మృతి చెందినట్లు సమాచారం లేదు: బొత్స

రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు చనిపోయినట్లు సమాచారం లేదని, కొందరికి మాత్రం గాయాలయినట్లు తమకు తెలిసిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు...

Update: 2023-06-03 12:19 GMT
Odisha Rail Incident: ఏపీ వాసులు మృతి చెందినట్లు సమాచారం లేదు: బొత్స
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు చనిపోయినట్లు సమాచారం లేదని, కొందరికి మాత్రం గాయాలయినట్లు తమకు తెలిసిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. రైలు ప్రమాదంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. గాయపడ్డ వారిని భువనేశ్వర్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు. బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లల కలెక్టరేట్లలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని.. రెండు రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని బొత్స కోరారు. 

ఇవి కూడా చదవండి:

Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో178 మంది ఏపీ వాసులు  

Tags:    

Similar News