టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. 110 మంది కోసం వేట

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై (Attack on Mangalagiri Tdp Office) దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ...

Update: 2024-09-06 09:14 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై (Attack on Mangalagiri Tdp Office) దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. టీడీపీ ఆఫీసుపై మొత్తం 110 మంది దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో వారందరి కోసం గాలిస్తోంది. ఇదే కేసులో విజయవాడ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి వదిలేశారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ నేతల కోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. ఈ కేసులో ఏ1గా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య ఉండగా.. ఏ-31గా దేవినేని అవినాశ్ రెడ్డి, ఏ-30గా లేళ్ల అప్పిరెడ్డి, ఏ-78గా తలశిల రఘురాం. ఏ-80గా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణమైనా ఈ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Similar News