Macharla: అప్పు తిరిగివ్వమని అడినందుకు మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి

అప్పు తిరిగి ఇవ్వమని అడినందుకు మాచర్ల ఎమ్మెల్యే(Macharla MLA) బావమరిదిపై అతని స్నేహితులు దాడి చేశారు.

Update: 2024-11-03 06:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అప్పు(Loan) తిరిగి ఇవ్వమని అడినందుకు మాచర్ల ఎమ్మెల్యే(Macharla MLA) బావమరిదిపై అతని స్నేహితులు దాడి చేశారు. పల్నాడు జిల్లా(Palnadu District) పట్టాభిపురం పోలీస్ స్టేషన్(Pattabhipuram Police Station) పరిధిలో జరిగిన ఘటన ప్రకారం మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి(Brahmananda Reddy) బావమరిది కృష్ణారెడ్డి(Krishna Reddy) అతడి స్నేహితునికి డబ్బు అప్పుగా ఇచ్చారు. తనకు రావాల్సిన నగదు ఇవ్వమని అడిగేందుకు నిన్న రాత్రి సమయంలో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్త ఘర్షణ మారడంతో బెహరా అనిల్(Behara Anil) బృందం కృష్ణారెడ్డి సహా తన వెంట ఉన్న మాధవరెడ్డిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో కారు(CAR), బైకు(BIKE) ధ్వంసం(Damage) అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పట్టాభిపురం పోలీసులు.. కృష్ణారెడ్డిపై దాడి చేసిన అనిల్ తో పాటు అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News