తిరుమలలో తప్పిన పెను ప్రమాదం.. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఐదుగురు
తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం ఉదయం భక్తులకు పెను ప్రమాదం తప్పింది. భక్తులతో పైకి వెళ్లవలసిన లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో మంగళవారం ఉదయం భక్తుల (devotees)కు పెను ప్రమాదం తప్పింది. భక్తులతో పైకి వెళ్లవలసిన లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లిఫ్టు (lift)లో ఉన్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరుమలలోని గోవింద నిలయం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లిఫ్ట్ లో సాంకేతిక సమస్య కారణంగా... మధ్యలో లిఫ్ట్ ఆగిపోగా ఐదుగురు భక్తులు (Five devotees) అందులోనే చిక్కుకున్నారు. దాదాపు లిఫ్ట్ 10 నిమిషాల పాటు మధ్యలో నిలిచిపోవడంతో అందులో ఉన్న భక్తులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నారు.
ఎట్టకేలకు స్థానికంగా ఉన్న సిబ్బంది స్పందించి లిఫ్ట్ తలుపులు (Lift doors) తెరిచి భక్తులను సురక్షితంగా కిందకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే లిఫ్ట్ సాంకేతిక సమస్య వల్ల నిలిచిపోయిందని తెలిసిన గోవింద నిలయం సిబ్బంది పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తూ.. సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.